Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎవరెస్ట్ ఎక్కే ప్రయత్నంలో డౌన్‌సిండ్రోం బాలుడు

వైకల్యాన్ని జయించి అద్భుతాలను సాధించిన ఎందరి ఉదంతాలో మనకు తారసపడుతుంటాయి. ఇదికూడా అలాంటిదే. న్యూయార్క్‌కు చెందిన ఇలీ రైమర్‌ అనే కుర్రాడు డౌన్‌సిండ్రోం (ఎదుగుదల లోపం)తో బాధపడుతున్నాడు. అతడు ఓ బృందంలో సభ్యునిగా రెండు వారాల పాటు ట్రెక్కింగ్‌ చేసి.. 17600 అడుగుల ఎత్తులో ఉండే ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నాడు. అక్కడినుంచి ఎవరెస్ట్‌ అధిరోహించాలంటే ఇంకా సుమారు 12వేల  అడుగుల ఎత్తు వరకు వెళ్లాల్సి ఉంటుంది. వైకల్యం ఉన్నప్పటికీ ఆ మాత్రం ఘనత సాధించిన తొలి యువకుడిగా రైమర్‌ న్యూయార్క్‌లో రికార్డు సృష్టించాడు. 

More Telugu News